![]() |
![]() |
.webp)
జయమ్ము నిశ్చయమ్మురా నెక్స్ట్ వీక్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇక ఈ షోకి మోడరన్ మహానటి కీర్తి సురేష్ వచ్చింది. ఇక జగపతి బాబు మీదనే కీర్తి ఫుల్ సెటైర్స్ వేసింది. "నువ్వు మహానటివి అని తెలుసు...బయట పెద్ద మహానటివి" అనేసరికి "మీకు మహానాటీ" అంటూ కన్ను కొట్టి సరదాగా మాట్లాడింది కీర్తి సురేష్. "స్కూల్ లో ఎలా ఉండేదానివి" అనేసరికి "ఉందా మీ దగ్గర ఫోటో" అని అడిగింది. "అదిగో" అంటూ కీర్తి స్కూల్ ఫోటో చూపించారు. "పాకెట్ మనీ నీకు ఇచ్చేవాళ్ళా నువ్వు జేబులోంచి కొట్టేసేదానివా" అని అడిగారు. "జేబులోంచి తియ్యడం..ఆ సంతోషమే వేరు" అని చెప్పేసరికి జగపతి బాబు పగలబడి నవ్వారు.
"సింగపూర్ లో నువ్వేదో క్రైమ్ లో ఇరుక్కున్నావ్ ఏంటది" అని అడిగారు. "అదొక్కటే తక్కువ..పోస్టర్ పెట్టేస్తారు స్టేషన్ లో " అంది కీర్తి. "అవును కుంభకర్ణి..ఆరు నెలలు తింటావ్ ఆరు నెలలు పడుకుంటావ్" అని అడిగేసరికి "కుంభకర్ణి.. నా గురించి మీకు అన్నీ తెలుసు.." అనేసింది కీర్తి. "సావిత్రి గారి బయోపిక్ ఎట్టాగో చూపించావ్ ఇప్పుడు నీ బయోపిక్ కి వెళదాం" అన్నారు జగపతి బాబు. "అన్ని చూస్తారు ఎంజాయ్ చేస్తారు" అంది కీర్తి. మహానటి సావిత్రి బయోపిక్ లో కీర్తి సురేష్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. అందులో కీర్తి సురేష్ నటించింది అనడం కంటే జీవించింది అని చెప్పొచ్చు. ఈ జెనెరేషన్ వాళ్లకు మహానటి సావిత్రి ఇలా ఉండేది అని చెప్పడానికి ఈ మహానటి మూవీ ఉపయోగపడుతుంది. అలాంటి కీర్తి సురేష్ జయమ్ము నిశ్చయమ్మురా షోకి వచ్చి ఎన్నో విషయాలను కిలకిలా నవ్వుతూ షేర్ చేసుకుంది.
![]() |
![]() |